calender_icon.png 12 December, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం

11-12-2025 12:00:00 AM

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 10 (విజయ క్రాంతి): ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్తు లో సోషల్ జస్టిస్ ఫర్ వరల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గత 15 సంవత్సరాలుగా సైకాలజిస్ట్ గా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల కు బెస్ట్ సోషల్ సర్వీస్ అండ్ సైకాలజస్ట్ అవార్డ్ ను అందుకున్నారు.

హెల్పింగ్ హారట్స్ వెల్ఫేర్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న అల్వాల ఈశ్వర్ , హ్యూమన్ రైట్స్ కౌన్సెల్ రాజన్న సిరిసిల్ల జిల్లా వైస్ చైర్మన్ మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో సేవలు అందిస్తున్న గడ్డం దినకర్ లకు ఉత్తమ సామాజిక సేవ అవార్డులు అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల విజయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హనుమా గౌడ్ హాజరై మాట్లాడినారు.మానవ హక్కుల రక్షణ కోసం అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సెల్ కన్వీనర్ గాజుల వేణు కుమార్, రాష్ట్ర విమెన్ వింగ్ డైరెక్టర్ గజ్జెల కరుణ లు అవార్డీ లను అభినందించారు.