11-12-2025 12:00:00 AM
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
కోనరావుపేట డిసెంబర్ 10 (విజయక్రాంతి ):కోనరావుపేట మండలంలో జరు గుతున్న మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు పురస్కరించుకొని బందోబస్త్ కు వచ్చిన పోలీస్ సిబ్బందికి ఆయా పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు.ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ..పోలింగ్ జరుగు సమయంలో, ఓట్ల లెక్కింపు సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల ను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.ఎన్నికల సమ యంలో రూట్ మొబైల్ పోలీస్ అధికారులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ,పోలింగ్ కేంద్రాలు,ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్తపడాలన్నారు.ఏదైన సమ స్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులకు సమచారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట పోలీస్ అధికారు లు,సిబ్బంది ఉన్నారు.