21-10-2025 06:38:35 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ ఐటీ విభాగం, ఎంసిఎ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఇన్నోవ్‌ఎక్స్ టెక్నికల్ క్లబ్ ప్రారంభోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జి. శేఖర్ రెడ్డి, డాక్టర్ జి.ఎల్. ఆనంద్‌బాబు, డాక్టర్ పి. రమేశ్‌బాబు, డాక్టర్ ఎ. ప్రశాంత్‌రావు, టాస్క్ నుండి రామ మనోజ్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి క్లబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఇన్నోవ్‌ఎక్స్ క్లబ్ లోగోను ఆవిష్కరించారు.
ముఖ్య అతిథులు విద్యార్థులను సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇలాంటి క్లబ్‌లు నూతన ఆవిష్కరణలకు వేదికవుతాయని ప్రోత్సహించారు. క్లబ్ అధ్యక్షుడు రవిరాజా, ఉపాధ్యక్షురాలు నాగలక్ష్మి రిక్కల, కార్యదర్శి ఖజాంచి అన్షు మాలిని, టెక్నికల్ హెడ్ బి. వైష్ణవి, కంటెంట్ విభాగ సభ్యులు రిషికా, సౌమ్య, సిరి చందన, పిఆర్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన కందర్ప జయలక్ష్మి, సాయి శ్రీజ, పి. సాయి అనుషా, డిజైన్ టీమ్ సభ్యులు పవన్, శివ, సోషల్ మీడియా లీడ్ సందీప్ పాల్గొన్నారు.