calender_icon.png 22 October, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎస్ యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

21-10-2025 06:40:57 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్)ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సూర్యాపేటలో మంగళవారం మండల మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాజిరెడ్డిగూడెం మండల టీఎస్ యూటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ సోమయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా కోటమర్తి వీరయ్య(ఎస్.ఏ జెడ్పీహెచ్ఎస్ అర్వపల్లి), ప్రధాన కార్యదర్శిగా నల్లగంటి వెంకన్న(ఎస్జీటీ ఎంపీపీఎస్ రామన్నగూడెం), ఉపాధ్యక్షులుగా కాకి సీనయ్య, మహిళా ఉపాధ్యక్షురాలుగా విజిత, కోశాధికారిగా ఉప్పునూతల శేఖర్, కార్యదర్శులుగా గౌతమి, వెంకటేశ్వర్లు, నాగయ్యలు ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ విద్యా పరిరక్షణకు నూతన కార్యవర్గం కృషి చేయడంతో పాటు సంఘం అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. తదనంతరం నూతన కార్యవర్గాన్ని సన్మానించి అభినందించారు.