06-11-2025 12:42:32 AM
కాప్రా, నవంబర్ 5(విజయక్రాంతి) : మీర్పే ట్, హెచ్.బీ కాలనీ డివిజన్ పరిధిలోని తిరుమలనగర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ కాలనీ ప్రజలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నాణ్యతా ప్రమాణాలు పాటి స్తూ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
మ్యాన్హోల్స్ చుట్టూ కాంక్రీటింగ్ దృఢంగా ఉండేలా చూడాలని, హెవీ వాహనాల రాకపోకలతో రోడ్డు త్వరగా దెబ్బతి నకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అధ్యక్షులు మల్లేష్ గౌడ్, దాస్, మురళీ చారి, నవీన్ పాల్గొన్నారు.