06-11-2025 12:42:49 AM
మోతె, నవంబర్05:- కారు పల్టీ కొట్టి మహిళ మృతి చెందిన ఘటన బుధవారం మండల పరిధిలోని మామిళ్ళ గూడెం గ్రామంలో చోటు చేసుకుంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా టి యస్ 05 ఈయస్ 0537 గల కారు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపుగా వెళుతున్న కారుకు కుక్క అడ్డు గా రావడం తో ఒక్క సారిగా బ్రేక్ వేయడంతో కారు పల్టీ కొట్టి అన్న పర్తి రాణి వయస్సు 38 అక్కడికక్కడే మృతి చెందింది.
మృతురాలి స్వంత గ్రామం తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పోచవరం గ్రామస్థులు గా చెప్పారు. మృతురాలు భర్త అన్న పర్తి సాయిరాం వయస్సు 52 కాగా వీరికి ఇద్దరు పిల్లలు కూతురు అన్యపర్తి జాహ్నవి 17 సంవత్సరాలు కాగా కుమారుడు లోకేష్ కి 15 సంవత్సరాలు పిల్లలిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.