calender_icon.png 20 May, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

19-05-2025 12:00:00 AM

కామారెడ్డి, మే 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని లింగుపల్లి, అంచనూర్ గ్రామాలలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ ఆదివారం సందర్శించారు.

ధాన్యం కొను గోలు సెంటర్ల నందు ధాన్యంలో తేమ శాతంను పరిశీలించి తొందరగా పూర్తి చేయాలని కొనుగోలు కేంద్రం నిర్వాహ కులకు తెలిపారు.  వర్షం నుండి ఇబ్బం దులు రాకుండా కుప్పల చుట్టూ కాలువలు ఏర్పాటు చేయాలని, టార్పాలిన్ లతో కప్పి ఉంచాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డి పి ఎం,రమేష్ బాబు, ఏ పి ఎం రాజు, సి సి ప్రవీణ్, కమిటి సభ్యులు పాల్గొన్నారు.