calender_icon.png 19 May, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం

19-05-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి, మే 1౮ (విజయ క్రాంతి) :  యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పై వెలసిన  స్వయంభూడు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకోవడానికి యాదాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవుల కు తోడుగా ఆదివారం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాదు నగరం నుండి వందలాదిమంది భక్తులు కుటుంబ సభ్యులు, బంధువులతో వివిధ వాహనాలలో యాదగిరి క్షేత్రానికి చేరుకున్నారు.

పార్కింగ్ కార్లతో నిండిపోయింది. ఎండ తీవ్రత లేకపోయినా వేడి ఎక్కువగా ఉండడంతో  తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొండపైన వేసిన తివాచీలు సరిపడకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

ఎండాకాలం పూర్తయ్యేంతవరకు కొండపైన తివాచీలు ఎక్కువగా వేయాలని భక్తులు డిమాండ్ చేశారు. భక్తులతో క్యూలైన్లు బార్లు తీరాయి. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది.  విఐపి లకు ప్రత్యేక దర్శనాలు ఆశీర్వచనాలు ఉండడంతో సామాన్య భక్తుల దర్శనానికి సమయం పట్టడంతో భక్తులు  అసహనానికి గురయ్యారు.