calender_icon.png 12 May, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి

10-05-2025 12:00:00 AM

  1. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి

13న వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి పోస్టర్ ఆవిష్కరణ

ముషీరాబాద్, మే 9 (విజయక్రాంతి) : వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని, ప్రతి వికలాంగునికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మే 13 న వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడించనున్నట్లు  వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి యం.  అడివయ్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం చిక్కడపల్లి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యురా లు పి. శశికల లతో కలిసి మే 13న జరిగే వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగాలని గత ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేటికీ అమలు కావడం లేదన్నారు. తక్షణమే జిల్లా స్థాయిల్లో ప్రత్యేక శాఖగా కొనసాగిస్తూ, అవసరమైన ఉద్యోగులను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. 40శాతం వైకాల్యం కలిగిన వికలాంగులకు సహాయక పరికరాలు అందించాలని, చదువుతో నిమిత్తం లేకుండా వైకల్య తీవ్రతను బట్టి మోటారైస్డ్ వెహికల్స్ ఇవ్వాలని డిమాం డ్ చేశారు.వికలాంగులతో ప్రత్యేక గ్రూప్లు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్స్ అమలు చేయాలని, యూనిఫామ్ సర్వీస్లలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ సి కేంద్రా ల్లో పని చేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మండల కేంద్రాల్లో భవిత సెంటర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. వికలాంగులపై జరుగుతున్న వేధింపులు అరికట్టెందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రతి వికలాంగునికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాల్లో వికలాంగుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సైన్ లాంగ్వేజ్, బ్రెయిలి లిపిలో ఇంటర్, డిగ్రీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సాంస్కృతిక సారధిలో 5శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం మే13 న డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.