calender_icon.png 15 August, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ స్టేడియంలో స్వాంతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

15-08-2025 01:04:46 AM

మహబూబాబాద్, ఆగస్టు 14 (విజయ క్రాంతి): మహబూబాబాద్ పట్టణం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగనున్న 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల ఏర్పాట్లను ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 79వ భారత  స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని, అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ అధికారి కృష్ణవేణి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా నాయక్, డి.ఈ.ఓ డాక్టర్ రవీందర్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి మరియన్న, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసిల్దార్ రాజేశ్వరరావు పాల్గొన్నారు.