calender_icon.png 15 August, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక లారీలను నియంత్రణ చేయకపోవడంతోనే కుంగిన మల్లంపల్లి బ్రిడ్జి

15-08-2025 01:00:38 AM

ములుగు మల్లంపల్లి, ఆగస్టు14(విజయక్రాంతి): ఇసుక లారీలు అధికలోడుతో నడుస్తున్న క్రమంలో మల్లంపల్లి బ్రిడ్జి కుంగిపోయిందని దీనికి ప్రధాన కారణం ఇసుక దందానే అని ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు ములుగు జిల్లాలోని జెడిమల్లంపల్లి మండలంలోని కెనాల్ దగ్గర ఉన్న కుంగిన బ్రిడ్జిని గురువారం రోజు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి బడే నాగజ్యోతి పరిశీలించారు.

అనంతరం బడే నాగజ్యోతి మాట్లాడుతూ బిడ్జి కూలడానికి ప్రధాన కారణం ఇసుక దందానే,ఇసుక లారీలను నియంత్రణ చేయకపోవ డంతో  బ్రిడ్జి కూలిపోయిందని దీనికి బాధ్యత వహించాల్సిన అధికారులు చేతులెత్తయడం దురదృష్టకరమని ఆమె అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కూడా ఉందని ఆమె ఆరోపించారు.  రోజురోజుకు వేయిల కొద్దీ ఇసుక లారీలు ఇసుకను తరలిస్తుండగా మంగపేట నుండి జెడి మల్లంపల్లి వరకు రోడ్లు గుంతలమయంగా మారి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకో వడం అధికారులు స్పందించడం అన్నారు.

డీఎంఎప్టీ ఫండ్ ఉన్న కూడా రోడ్డు మరమ్మత్తుల కోసం నిధులు వినియోగించుకోవడంలేదని పత్రిక ముఖంగా ఆమె అధికారులు కోరారు రాకపోకలకు అంతరాయం జరుగుతుందని ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారు లు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రత్యామ్నాయ మార్గాల కోసం కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుందని, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.