calender_icon.png 15 August, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుల్లో.. చేపలు దూకేనా?

15-08-2025 12:39:01 AM

  1. చేప పిల్లల విడుదలకు ఖరారైన టెండర్ల ప్రక్రియ
  2. రెండేళ్ల బకాయి చెల్లిస్తేనే టెండర్లు పాల్గొంటాముంటున్న లైసెన్స్ దారులు
  3. ప్రభుత్వ తీరుపై మత్స్యకార్మికుల్లో ఆందోళన

నిర్మల్, ఆగస్టు 1౪ (విజయక్రాంతి): మచ్చ కార్మికులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ విడుదలపై సంసిద్ధత నెలకొంది. వానాకాలం సీజన్ ప్రారంభమై మూడు నెల లు గడుస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు చేప పిల్లల విడుదలకు టెండర్ల ప్రక్రియ ఖరారు చేయడం తో చేప పిల్లలు విడుదలపై మత్స్య కార్మికుల ఆందోళన నెలకొంది.

వచ్చే నెల 15 వరకు టెండర్లను ఆహ్వానించి ఆ తర్వాత తక్కువ కోడ్ చేసిన వారికి చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టెండర్ల ప్రక్రి యపై ఆలస్యం కావడంతో అసలు చేప పిల్లలు సరఫరా అవుతాయా కాదా అని ఆం దోళన జిల్లాలో నెలకొంది. ప్రభుత్వం సాధారణంగా జూన్ జూలై మాసాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు మాస్టంలో జిల్లాలోని ప్రాజెక్టుల తో పాటు చెరువుల్లో 100% సబ్సిడీ సేవకులను విడుదల చేయాలి.

కానీ ఈ ప్రక్రియ రెండు నెలలు ఆలస్యం కావడంతో చేప పిల్లలు విడుదల చేసిన చెరువుల్లో ప్రాజెక్టు నీటిలో వృద్ధిరేటు పెరిగి అవకాశాలు లేకపోవడంతో కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా చేప పిల్లల విడుదల ప్రక్రియ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 

మత్స్య కార్మికులపై ప్రభావం

రాష్ట్ర మత్స్యశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం చేప పిల్లల విడుదలకు టెండర్ల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 13538 మత్స్య కార్మికులు ఉండగా 188 మత్స్య కార్మిక సంఘాలు ఉన్నాయి. ఇందులో 50 వరకు మత్స్య మహిళా కార్మిక సంఘాలు కూడా చేప పిల్లల ఉత్పత్తి ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.

జిల్లాలో శ్రీరాంసాగర్ స్వర్ణ రిజర్వాయర్ గడ్డెన్న సుద్ద వాగు కడెం నారాయణరెడ్డి పాలసీ రంగారావు రంగారావుకర్ ప్రాజెక్టు తో పాటు చిన్న నీటి మద్దతు నీటి వనరుల కింద ఉన్న 534 చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేయవలసి ఉంది. 2025 సంవత్సరం గాను 4.75 కోట్ల కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఇందులో ప్రధానంగా రెండు రకాలైన మొట్ట రవాటా చేప పిల్ల లు ఉన్నాయి. 40 గ్రాములు 80 గ్రాములు బరువు ఉన్న చేప పిల్లలను 100% సబ్సిడీపై చెరువుల్లో విడుదలకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు నిధులను కేటాయిస్తుంది. నిర్మల్ జిల్లాలో కూడా చేప పిల్లలు విడుదలకు మత్స్య కార్మిక సంఘాలతో జిల్లా మత్స్యశాఖ అధికారులు సమన్వయం చేసుకొని చెరువుల్లో నీటి పరిణామం విస్తీర్ణం ఆధారంగా చేప పిల్లల విడుదల టార్గెట్ ను కేటాయించారు 

చేప పిల్ల విడుదల కష్టమే ?

నిర్మల్ జిల్లాలో సాగునీటి వనరులైన ప్రాజెక్టులు చెరువుల్లో చేప పిల్లల విడుదలకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించినప్పటికీ వర్షాభావ పరిస్థితుల దృశ్య నిర్మల్ జిల్లా లో చెరువుల్లో చేప పిల్లలు విడుదల ఈసారి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేదని మత్స్య కార్మికులే పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 600 పైగా చెరువులు ఉన్నప్పటికీ గత మూడు నెలల నుంచి వర్షాకాలం ప్రారంభమైన భారీ వర్షాలు లేకపోవడంతో నిర్మల్ బైంసా ముధోల్ తదితర ప్రాంతాల్లో చెరువుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు కాకపోవడంతో నీటి పరిణామం తక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

జిల్లాలో ఇప్పటికీ 400 చెరువులపైగా 50 శాతం నీరు కూడా నిండకపోవడం ఈ పరిస్థితికి అద్దం పడుతుంది. కొన్ని చెరువుల్లోనైతే 20 శాతం కూడా నీరు రాలేదని ఇటువంటి చెరువులో చేప పిల్లల విడుదల చేస్తే అవకాశమే లేకుండా పోతుందని మత్స్య కార్మికులు ఆందోళన చెం దుతున్నారు.

జూన్ జూలై మాసంలో వర్షాలు కురిస్తే గతంలో చెరువులు నిండివని ఇప్పుడు ఆగస్టు మాసం ముగింపుకు వచ్చిన చెరువులు నిండక పోతే చేప పిల్లల ఉత్పత్తి ఎదుగుదలపై ప్రభావం పడి తమకు ఉపాధి కరువుతోందని మత్స్య కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

అయితే శ్రీరామ్ సాగర్ గడ్డన్న శుద్ధ వాగు స్వర్ణ ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు పలుసీ రంగారావు గారి ప్రాజెక్ట్ ను నీరు పుష్కలంగా ఉండడంతో మొదటగా ఆ ప్రాజెక్టులోనే చేప పిల్లలు విడుదల చేయాలని జిల్లా అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. 

టెండర్ల ప్రక్రియ పై అనుమానమే

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చేప పిల్లల సరఫరాకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ టెండర్ల నమోదుపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. జిల్లాలో లైసెన్స్ పొందిన చేపల చెరువుల యజమానులు చేప పిల్లల విడుదలకు టెండర్ల ప్రక్రియలో పాల్గొని అగ్రిమెంట్ అయిన తర్వాతనే చేప పిల్లలను ఆయా సాగునీటి వనరులకు సరఫరా చేయవలసి ఉంటుంది.

జిల్లాలో గతంలో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా నుంచి చేప పిల్లలను దిగు మతి చేసుకునేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకొ ని నిర్మల్ జిల్లా చెందిన కొందరు చేపల చెరువులను తవ్వించి చేప పిల్లలను పెంచి వాటిని ప్రభుత్వంకు విక్రయిస్తున్నారు. గత సంవత్సరం కూడా తమకు పాత బిల్లులు చెల్లిస్తేనే కొత్తగా చేప పిల్లలను సరఫరా చేస్తామని చేప పిల్లల ఉత్పత్తి యజమానులు ప్రభుత్వానికి అల్టిమేట్టం జారీ చేయగా పెండింగ్లో ఉన్న బిల్లులో సగం బిల్లులు చెల్లించి మిగతా సగం బిల్లులను దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్టు వారు పేర్కొంటున్నారు.

అయితే ఆ బిల్లులు ఇప్పటివరకు చెల్లించకపోవడంతో అధికారుల చుట్టూ బిల్లుల కోసం తిరుగుతున్నట్టు కొందరు తెలిపారు. ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. చేప పిల్లలు విడుదల మరింత జాప్యం జరిగితే మచ్చ కార్మికులకు మరింత నష్టం జరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి పెట్టాలని జిల్లా మత్స్య కార్మిక సంఘా లు అధికారులు కోరుతున్నారు.

జిల్లాలో 4.75 కోట్ల చేప పిల్లల విడుదల

నిర్మల్ జిల్లాలో 2025 26 సంవత్సరానికి గాను 4.75 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినం. జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల తో పాటు 530 చెరువుల్లో చేప పిల్లలను సరఫరా చేసేందుకు కావలసిన టెండర్ల ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతున్నాం.

ఇప్పటికే ప్రభుత్వం చేప పిల్లల ఉత్పత్తిదారులకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని తమకు విన్నవిస్తున్నారు ఈ విషయమై ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చాం. త్వరలో నిధులు విడుదలై చెప్పు పిల్లల ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నాం మత్స్య కార్మికులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

రాజ నరసయ్య, జిల్లా అధికారి నిర్మల్