15-08-2025 01:03:10 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, ఆగస్టు 14 (విజయ క్రాంతి) : జగిత్యాల పట్టణంలో రు. 150 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు మార్ గురువారం పట్టణంలోని వివిధ వా ర్డుల్లో రు. కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్టంలోనే అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరు చేయటం జరిగిందన్నారు. అభివృద్ది తో పాటు పచ్చదనం, పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామన్నారు.
ప్రజల సహకారంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమన్నారు. జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రు. 20 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగిందని, అధికారు లు త్వరిత గతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అభివృద్ది పనుల విషయంలో ఆటంకం కలిగించవద్దని ప్రతిపక్షాలను కోరుతున్నామన్నారు. 40 ఇండ్లు కట్టని నాయ కులు ఇతర నియోజకవర్గం నుండి ఇక్కడికి వచ్చి 4500 ఇండ్ల మౌలిక వసతులు పై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
ప్రజలు మున్సిపల్ సిబ్బందికి తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలన్నారు. డంపింగ్ యార్డులో ప్రహారీకి రూ.2 కోట్ల నిధులు మంజూర య్యాయని, ఇప్పటివరకే రూ.5 కోట్ల నిధు లు చెత్త శుద్ధికి మంజూరు చేశామన్నారు. పచ్చదనం పరిశుభ్రత విషయంలో జగిత్యా ల ఆదర్శంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత అందరిదన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మన్సూర్, నా యకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,ఖాజిం అలీ, కో ఆప్షన్ హసిబొద్దిన్, మాజీ కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్, ఫిర్దోస్ తరుణం, బాలే శంకర్,తోటమల్లికార్జున్, కూతురు పద్మ శేఖర్, కూతురు రాజేష్, బోడ్ల జగదీష్, డిష్ జగన్ తదితరులు ఉన్నారు.