07-07-2025 12:00:00 AM
స్మార్ట్‌ఫోన్ చేతిలో మన జీవితం స్క్రోల్
ఎప్పుడో మొదలైంది
ఒక్క రీల్ కోసం జీవితాన్నే రిస్క్ చేస్తాం
బాహుబలి-బల్లాలదేవలాగ లైక్స్ కోసం పోటీ పడతాం
ఇన్‌స్టాగ్రామ్... ఇష్టాల కోసం ఆత్మాభిమానాన్ని
అమ్మేసిన చోట
వాస్తవం వదిలి ఫిల్టర్‌లే నిజమైపోయాయి
కళ్ళ ముందున్నది లైఫ్ కాదు
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఫోజులే
జీవితమయ్యాయి..
కష్టపడే కన్నా చూపులకే డబ్బు వస్తుందన్న నమ్మకం
గుర్తింపును వెతుక్కుంటూ వదిలేస్తున్నారు గమ్యాన్ని
జ్ఞానం కన్నా వ్యూస్ పెరగాలని ఆకాంక్ష
ఉపయోగం కన్నా అటెన్షన్ కోసమే ఆరాటం
స్వీయ విలువలు స్క్రోల్స్‌లో మాయమవుతున్న తరుణం
ఉపదేశాలన్నీ మేమే అనే తప్పుడు అహంకారం
గురువులను అనుసరించడం ఎప్పుడో మరిచాము
ఇన్‌ఫ్లూయెన్సర్ల లైఫ్ కాపీ చేయడమే లక్ష్యం
ఒక్క సెల్ఫీకి గంటల సమయం
ఒక్క పోస్టుకి జీవితాన్ని సైతం ఆపేస్తం
ఇది యువత కాదు.. యాంత్రిక ఆకర్షణలో
పడిపోయిన భవిత.