12-04-2025 12:00:00 AM
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 11 : పట్టణంలోని సూపర్ బజార్ ఏరియా సాయిబాబా దేవాలయ ప్రాంగణం లో దేవత సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శుక్రవారం భక్తులు అత్యంత భక్తి,శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు మూడు రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు తీర్థ, అన్నదాన ప్రసాదల వితరణ నిర్వహించారు.