calender_icon.png 20 October, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అవమానం

20-10-2025 01:51:58 AM

మాజీ మంత్రులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : మహిళా మంత్రి ఇంటి మీదకు పోలీసులను పంపించడం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్‌ఎ స్ అభ్యర్థి సునీతపై ఏకంగా మంత్రులే అనుచి త వ్యాఖ్యలు చేయడం.. మిస్ వరల్డ్ పోటీల్లో మహిళకు అన్యాయం చేయడం.. మహిళా జర్నలిస్టులపై కేసులు పెట్టడం.. ఇలా మహిళ లను అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.

నాడు కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల అభివృద్ధి జరిగితే, నేడు రాష్ర్టంలో అరాచక పాలన కొనసాగు తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ర్టంలో గన్ కల్చర్ తెచ్చారని ఆరోపిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి సబితారెడ్డి మీడియాతో మాట్లాడారు. మిస్ వరల్డ్ పోటీల్లో మహిళకు అన్యాయం జరిగితే దానిపై క్లారిటీ ఇవ్వలేదని,

సీఎం సొంత నియోజక వర్గంలోనే మహిళా జర్నలి స్టులపై కేసులు పెట్టారని తెలిపారు. నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను సీఎం అవమా నించారని, తాజాగా మాగంటి సునీతపై మం త్రుల అనుచిత వ్యాఖ్యలు దారుణమన్నారు. మంత్రి ఇంటిపైకి అర్ధరాత్రి పోలీసులు వెళితే దానిపై ఎఫ్‌ఐఆర్ ఉందా, పోలీసులు దీనిపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించా రు. ప్రశ్నించారు. సత్యవతి రాథోడ్ మాట్లాడు తూ... రాష్ర్టంలో పాలన గాడి తప్పిందని, సీఎం ఇంటి సమీపంలో గన్ తో బెదిరించే పరిస్థితి నెలకొందని అన్నారు. 

హరీశ్‌రావు క్యాబినెట్ సమావేశంపై మాట్లాడితే మంత్రి సీతక్క తల్లిదండ్రులపై ఎందుకు ప్రమాణం చేస్తుందని ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో ఓ మహి ళా ఉద్యోగి పట్ల జరిగిన లైంగిక వేధింపులపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. మాగంటి సునీతపై మంత్రుల వ్యాఖ్యలు దౌర్భాగ్యమని మండి పడ్డారు. మంత్రి కూతురే ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమవుతుందన్నారు.