calender_icon.png 20 October, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 99 వల్ల మాలలకు అన్యాయం

20-10-2025 01:53:40 AM

  1. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఫలితం శూన్యం
  2. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోటీలో నామినేషన్ దాఖలు
  3. తెలంగాణ మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేరా బాలకిషన్

ముషీరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ జీవో నెంబర్ 99 వలన ఎస్సీలలోని 58 కులాలకు పూర్తి  అన్యాయం జరుగుతుందని తెలంగాణ మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బీర బాలకిషన్ (బాలన్న) అన్నారు. అనేక మార్లు ఉప ముఖ్యమంత్రి,  మంత్రులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఫలితం లేదని ఆయన మండిపడ్డారు. 

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను తెలంగాణ రాష్ట్ర మాల సం ఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్ వర్కింగ్ చైర్మన్ మంత్రి నరసిం హయ్య, రాష్ట్ర మాల యూత్ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ పి. వి. స్వామి, తెలంగాణ రాష్ట్ర మాల విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు మాదాసు రాహుల్ రావులతో కలిసి   షేక్పేట తహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేసినట్లు ఆది వారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ సందర్భంగా బేర  బాలకిషన్  మాట్లాడుతూ తెలంగాణలోని 30 నుంచి 40 లక్షల మంది వర కు ఉన్న మాల సమాజానికి న్యాయం జరగడానికి  ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 200 మంది వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నామినేషన్లు వేయనున్నామన న్నారు. జూబ్లీహిల్స్ శాసనసభ ఎన్నికల్లో  రేవంత్ రెడ్డి అహంకారంతో  మాలలను చిన్నచూపు చూస్తూ 40 లక్షల మంది మా లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని బేర బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.