calender_icon.png 25 July, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి

24-07-2025 01:32:43 AM

  1. వైద్యారోగ్యశాఖలో పదోన్నతుల జాతర

33 స్పెషాలిటీ విభాగాల్లో 309 పదోన్నతులు

పదోన్నతులు పొందిన వారికి పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ఎప్పుడూ లేని విధంగా తెలంగా ణ వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతుల జాతర నడుస్తోంది. తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పదోన్నతులతో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూనే.. మరోవైపు టీచింగ్ ఫ్యాకల్టీకి ప్రమోషన్లు కల్పిస్తున్నారు. తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో అసోసియేట్ ప్రొఫెసర్లకు, ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు కల్పించారు.

33 స్పెషాలిటీ విభాగాల్లో 309 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. ప్రమోషన్లు పొందిన వారికి పోస్టింగ్స్ ఇ స్తూ బుధవారం జీవోలు విడుదల చేశారు. పదోన్నతులతో మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత తీరనున్నది. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు... అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఇటీవలే 607 అసిస్టెంట్ ప్రొ ఫెసర్ పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది.

దీనికి సంబంధించి దరఖా స్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. మరో 714 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే 44 మంది ప్రొఫెసర్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా పదోన్నతి ఇవ్వగా.. మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్, టీచింగ్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లుగా వారికి పోస్టింగ్స్ ఇచ్చింది.

మొత్తంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మెడికల్ కాలేజీల అభివృద్ధి, ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) సైతం ఇటీవల ప్రశంసించింది. అందుకే ఒక్క సీటుకు కూడా కోత పెట్టకుండా, ఎలాంటి జరిమానా విధించకుండా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు కొనసాగిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది.