24-07-2025 12:44:13 AM
- నగరీకరణతో కలుషితం అవుతున్న నీరు
- మురుగు నీటి శుద్ధికి ప్రభుత్వం చర్యలు
- రూ. 82.23 కోట్లతో నాలుగు చోట్ల ఎస్టీపీల నిర్మాణం
- 2050 వరకు ఉత్పన్నమయ్యే మురుగును తట్టుకునేలా డిజైన్
చేవెళ్ల, జులై 23:నగరీకరణతో కలుషితమమవుతున్న జంట జలాశయాల (హిమాయ త్ సాగర్, ఉస్మాన్ సాగర్) పరిరక్షణకు ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 111 జీవో ఎత్తివేతను పక్కన పెట్టిన సర్కారు.. కాలనీలు, హోటళ్లు, విద్యా సంస్థ లు, హాస్టళ్లు, విల్లాలు, ఫామ్ హౌసుల ద్వా రా ఉత్పన్నమయ్యే మురుగు నీటికి చెక్ పె ట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై , సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డుకు స మీపంలో జలాశయాలకు బ్యాక్ సైడ్ ఉన్న ప్రాంతాల్లో నాలుగు ఎస్టీపీల( సీవరేజ్ ట్రీ ట్మెంట్ ప్లాంట్లు) నిర్మాణాన్ని చేపట్టింది. ఇం దుకోసం రూ. 82.23 కోట్లు ఖర్చు చేస్తోంది. 2050 వరకు ఉత్పన్నమయ్యే మురుగును అంచనా వేసి రూపొందించిన ఈ ప్లాంట్ల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఎక్కువగా కలుషితం అవుతుంది ఇక్కడే..
హైదరాబాద్ మహా నగరం నలుదిక్కులా వేగంగా విస్తరిస్తోం ది. తూర్పు, దక్షిణం, ఉత్తరం వైపు ఇప్పటికే ఎటూ 50 కి.మీ వరకు వెళ్లిపోయింది. ఒక్క పశ్చిమం వైపు మాత్రమే 111 జీవో కారణంగా ఇన్నాళ్లు ఔటర్ రింగ్ రోడ్డు దాటి పెద్దగా రాలేదు. కానీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో 111 జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించం తో ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో కాలనీలు, వేల సంఖ్యలో విల్లాలు, ఫామ్ హౌస్లు నిర్మాణం అయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండే శంషాబాద్ పరిధిలోని కొ త్వాల్ గూడ, హిమాయత్ సాగర్, కవ్వగూ డ, ఇటీవల శంకర్ పల్లి మండలం నుంచి నార్సింగి మున్సిపాలిటీలో వి లీ నం అయిన జన్వాడ, మిర్జాగూ డ, ఇటీవల మున్సిపాలి టీగా మారిన మొయినాబాద్ పరిధిలోని అజీజ్ నగర్, చిల్కూరు, హిమాయత్‌నగర్ తదితర ప్రాం తాల్లో కొత్త కాలనీలు, బస్తీలు ఏ ర్పాటయ్యాయి.
ఇటు బీజాపూర్ హైవేకు ఇరువైపులా అప్పా జంక్షన్, అజీజ్ నగర్, హిమాయత్ నగర్, మొయినాబాద్, కనక మామిడి వరకు, అటు నార్సింగి నుంచి శం కర్ పల్లి రోడ్డుకు ఇరువైపులా దొంతాన్ పల్లి, జన్వాడ, ఖానాపూర్, మోకిలా వరకు భారీ హోటళ్లు, విద్యా సంస్థ లు, హాస్టళ్లు వెలిశా యి. వీటి ద్వారా ఉత్పన్నమవుతున్న మురుగునీరు చాలావరకు జలా శయాల్లో కలు స్తోంది. మోకిలా 111 జీవో పరిధిలో లేకపోయినా ఇక్కడ వెలసిన అనేక అపార్టమెంట్ల నుంచి వచ్చే మురుగును పక్క నే ఉన్న ఫి రంగి నాలాతో పాటు కాలువల ద్వారా మూ సీలోకి పంపిస్తున్నారు. దీంతో అలర్ట్ అయి న వాటర్ బోర్డు ఎస్టీపీలు ఏర్పా టు చేయాలని నిర్ణయించింది.
20 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణం
వాటర్ బోర్డు ఆధ్వర్యంలో శంషాబాద్ ప రిధిలోని కొత్వాల్గూడ వద్ద 6 ఎంఎల్డీ, మొ యినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ వ ద్ద 5 ఎంఎల్డీ, మున్సిపాలిటీలోని హిమాయ త్ నగర్ 5 ఎంఎల్డీ, నార్సింగి మున్సిపాలిటీలోని జన్వాడ వద్ద 4 ఎంఎల్డీ డీ సామర్థ్యం తో ఈ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. ఇవి రోజుకు మొత్తం 20 మిలియన్ లీటర్ల మురుగునీటి ని శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. కొ త్వాల్గూడ, నాగిరెడ్డిగూడలలో పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
ముందు ఫిల్టరింగ్ చేసి మట్టి, చెత్తను వేరు చేస్తారు. తర్వాత బ్యా క్టీరియా ద్వారా నీటిలో ఉన్న హానికరమైన పదార్థాలను తొలగిస్తారు. చివరగా యూవీ, క్లోరిన్ ద్వారా శుద్ధి చేస్తారు. ఈ నీటిని ఉద్యా న వనాలకో, నిర్మాణ పనులకో, పారిశుద్ధ్య అవసరాలకో వాడుతారు. వాస్తవానికి ప్రభు త్వ నిబంధనల ప్రకారం ప్రతి పెద్ద కాలనీకి, అపార్ట్మెంట్కి తప్పనిసరిగా ఎస్టీపీ ఉండాలి. కానీ, అధికారుల పర్వవేక్షరణ లేకపోవడ మో, మేనేజ్ చేసుకోవడమో గానీ,ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.