24-01-2026 08:36:00 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కోసం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో శనివారం నిర్వహించిన “డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ–5కే రన్” కార్యక్రమంలో ఘనపూర్ లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడమే ఈకార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. ఈకార్యక్రమంలో పాల్గొన్న కెపిఆర్ఐటి విద్యార్థులను, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను కళాశాల యాజమాన్యం అభినందించింది.
ఈ సందర్భంగా కెపిఆర్ఐటి చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్, డైరెక్టర్ స్ట్రాటజీ కొమ్మూరి దివ్యశ్రీ , డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కాశ్యప్, సీఈఓ గుండ నాగరాజు, అలాగే అన్ని హెచ్‌ఓడీలు, డీన్లు విద్యార్థుల సేవలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా ఈకార్యక్రమాన్ని సమర్థవంతంగా సమన్వయం చేసిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి. రఘురామ్ రెడ్డికి, పాల్గొన్న విద్యార్థులందరికీ కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది. సామాజిక బాధ్యతతో విద్యార్థులు ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమని నిర్వహణ పేర్కొంది.