05-12-2025 12:00:00 AM
జహీరాబాద్ టౌన్, డిసెంబర్ 4 :అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పుర స్కరించుకొని సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి.కవిత దేవి గురువారం భవిత కేంద్రాన్ని సందర్శించారు. అక్కడకు వచ్చే వికలాంగ విద్యార్థుల కు అందుతున్న సేవలు, ఆహారం, ఆటవస్తువులు మొదలగు వాటిపై ఆరా తీశారు. ప్యా నల్ న్యాయవాదులు, ఎం.ఈ.వో, అధ్యాపక బృందంతో సమావేశం నిర్వహించారు.
పిల్లలకు పండ్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ గోపాల్, వైస్ ప్రెసిడెంట్ మానెన్న, న్యాయవాదులు రుద్రయ్య స్వా మి, విజయ్ కుమార్, లీగల్ సర్వీసెస్ సిబ్బం ది, పారాలీగల్ వాలంటీర్, ఎంఈవో మాణ య్య, రిటైర్డ్ ఎంఈవో బస్వరాజ్, మాణిక్ ప్రభు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.