05-12-2025 12:00:00 AM
పటాన్ చెరు, డిసెంబర్ 4 :నిర్మాణంలో కాంక్రీటుకు కావలసిన ఆకారాన్ని ఇవ్వడానికి ఉపయోగించే ఫార్మ్ వర్క్ (రూపకల్పన), నిర్మాణ పనులలో ఎత్తులో ఉన్న ప్రదేశాలకు చేరడానికి, పనిముట్లు కార్మికులకు ఇవ్వడానికి ఉపయోగించే పరంజాల గురించి గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులు క్షేత్ర సందర్శనలో స్వీయ అనుభవాన్ని గడించారు. వాస్తవ సమయంలో ఫార్మ్ వర్క్, స్కాఫోల్డింగ్ లపై లోతైన అవగాహనను పొందారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు అమిత్ భట్టాచార్య, తపతి తపన్విత భంజా మార్గదర్శనంలో గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఐదో సెమిస్టర్ విద్యార్థులకు ఈ క్షేత్ర స్థాయి సందర్శనను ఇటీవల నిర్వహించారు. ఫార్మ్ వర్క్ పద్ధతులను స్వయంగా చూడటానికి, ఇందులో ఉ న్న భాగాలను అధ్యయనం చేయడంతో పా టు వాస్తవ నిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించే పద్ధతులను అన్వేషించడానికి ఈ క్షేత్ర సందర్శన విద్యార్థులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.
కలప, ఫ్లైవుడ్, లోహంతో సహా వివిధ రకాల ఫార్మ్ వర్కులను విద్యార్థులు పరిశీలించి, నిర్దిష్ట నిర్మాణ అవసరాల ఆధారంగా వాటిని ఎలా ఎంచుకుంటారో తెలుసుకున్నారు. ఈ ఆచరణాత్మక అనుభవం తరగతి గది అభ్యాసాన్ని బలోపేతం చేయడమే కాకుండా, భవన నిర్మాణ పరిశ్రమకు అవసరమైన ఖచ్చితత్వం, ప్రణాళిక, సాంకేతిక నైపుణ్యం పట్ల వారి అవగాహనను మరింత పెంచిందని తెలిపారు.