14-10-2025 04:42:14 PM
జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): నేటి బాలలే రేపటి పౌరులు అని జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల అన్నారు. మంగళవారం పట్టణంలోని వైష్ణవి మహిళ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల మాట్లాడారు. మహిళలు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని నిలబడాలని ఆయన సూచించారు. మంచి చదువులు చదువుకొని టాప్ పొజిషన్లో ఉన్నతమైన స్థానాల్లో ఎదగాలని బాలికలు గోల్ కొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమిరెడ్డి సత్తన్న, న్యాయవాది గడికొప్పుల కిరణ్, రహమతుల్లా, రవీందర్ చాతరాజు శివ శంకర్, కళాశాల ప్రిన్సిపాల్ ఆకుల కిరణ్ కుమార్, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.