calender_icon.png 15 October, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సుంకి యాదగిరి వర్ధంతి

14-10-2025 07:54:05 PM

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో సిపిఎం పార్టీ  పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సుంకి యాదగిరి నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడుతూ సుంకి యాదగిరి సిపిఎం పార్టీకి ఎనలేని కృషి చేసి ప్రాణ ఉన్నంతవరకు ఎర్రజెండాను వీడకుండా పేద ప్రజల పక్షాన నిలబడి అనేక ప్రజాసమస్యలపై పనిచేసిన వ్యక్తి యాదగిరిని ఆమె కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకపోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకట గౌడ్ పార్టీ టౌన్ కార్యదర్శి ఒంటెపాక వెంకటేశ్వర్లు మాజీ ఎంపీపీ సుంకు మన్నెమ్మ మండల నాయకులు చెన్న బోయిన నాగమణి వంటేపాక కృష్ణ చాకుట్ల నరసింహ గునుగుంట్ల బుచ్చి రాములు పన్నాల శశికళ గురుజ స్వరూప సుంకి శోభన్ ఆదిమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.