calender_icon.png 15 October, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనీస మద్దతు ధరల పోస్టర్ ఆవిష్కరణ

14-10-2025 08:18:17 PM

గద్వాల (విజయక్రాంతి): పత్తి అమ్మకానికి ముందు కాపస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ తమ ఛాంబర్ నందు రైతుల అవగాహన కోసం కనీస మద్దతు ధరల వివరాలు, కాటన్ కాపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియపై సమాచారాన్ని అందించే పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు 2025-26 పత్తి పంటకు కనీస మద్దతు ధర,పత్తి పింజ రకం బిబి మోడ్– రూ.8,110, బీబీ ఎస్పిఎల్– రూ.8,060, మెక్– రూ.8,010,ఒక్కో క్వింటాల్‌కు వర్తిస్తాయని వెల్లడించారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులు తమ పత్తి పంటను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు.

ఓటీపీ  కోసం ఆధార్ లింక్ ఉన్న మొబైల్ ఉండాలని,మరియు నగదు చెల్లింపుల కోసం బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయించడం అత్యంత అవసరమనీ తెలిపారు. తేమ శాతం 8%–12% ఉండాలని తెలిపారు.పత్తిని అమ్మడానికి వచ్చే ముందు రైతులు కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. జిలాల్లోని హరిత కాటన్ మిల్,బాలాజీ కాటన్ జిన్నింగ్ మిల్,శ్రీ వరసిద్ధి వినాయక కాటన్  మిల్లులు ఉన్నట్లు తెలిపారు.

రైతులు తమ పత్తిని నేరుగా సిసిఐ కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.పత్తి కొనుగోలు 27 అక్టోబర్ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు పత్తి కొనుగోలు కేంద్రాల వివరాలు, అమ్మకం, చెల్లింపు స్థితి వంటి సమాచారం కోసం 1800 599 5779 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా 8897281111 వాట్సాప్ నంబర్ ద్వారా ఎప్పుడైనా సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పుష్పమ్మ, గద్వాల మార్కెట్ కార్యదర్శి నరసింహ, అలంపూర్ మార్కెట్ కార్యదర్శి ఎల్లస్వామి,తదితరులు పాల్గొన్నారు.