calender_icon.png 15 October, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెక్నాలజీని మంచికి మాత్రమే ఉపయోగించుకోవాలి

14-10-2025 07:52:02 PM

మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి..

మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, విద్యార్థుల సమస్యలు అడిగి సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు మంచి, చెడుల గురించి తెలుసుకోవాలన్నారు. తల్లిదండ్రులను, గురువులను సమాజాన్ని, గౌరవించాలని యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తూ, టెక్నాలజీని మంచి కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని, విద్యార్థులు చెడు మార్గాల వైపు ఆకర్షించకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు నర్సింగ్ రావు, తిరుపతి కళాశాల విద్యార్థులు సిబ్బంది పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.