14-10-2025 07:49:55 PM
మొగుళ్ళపల్లి ఎస్ఐ బోరగాల అశోక్..
చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అక్రమ ఇసుక దందాపై ఎస్ఐ బోరగాల అశోక్ కన్నెర్ర చేశారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక దందాను కొనసాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలోని పోతుగల్లు వాగు నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత ట్రాక్టర్ డ్రైవర్ల పై, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.