08-10-2025 06:27:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో గురువారం విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆపరేషన్ డిఇ నాగరాజు తెలిపారు. గాజులపేట ఫీడర్లో 11 కేవీ వైర్ల మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.