calender_icon.png 15 August, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్రాష్ట్ర పశువుల దొంగల ముఠా అరెస్ట్

15-08-2025 12:49:33 AM

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్, ఆగస్టు 1౪ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలైన బాసర ముధోల్ కుబీర్ కుంటాల తానూర్ పరిసర ప్రాంతాల నుంచి పశువులను దొంగలించి మహారాష్ట్రకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర పశువుల దొంగ రవాణా ముఠాను పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అవి మాట్లాడు తూ జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి రాత్రి సమయంలో పశువుల కొట్టాలు రోడ్లపై ఉన్న పశువులకు మత్తుమందు ఇచ్చి మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా సభ్యులు పశువులను దొంగలిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు.

దీనిపై బైంసా ఎస్పీ అవినాష్ కుమార్ నిర్మల్ ఏ ఎస్ పి రాకేష్ మీనా ఆధర్ లో పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి నట్టు తెలిపారు. ఇటీవలి బాసర బిదిరెల్లి ముధోల్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పశువుల దొంగతనాలు జరగడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగిందన్నారు. పశువులకు డిమాండ్ ఉండడం రేట్లు పెరగడంతో సులభంగా దొంగిలించి అక్రమ రవాణా చేసేందుకు మహారా ష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన సయ్యద్ సోహెల్ అనే వ్యక్తి 40 మంది సభ్యులతో ఒక ముఠాగా ఏర్పడిందని తెలిపారు.

ఈ ముఠాలో మహారాష్ట్ర బైంసా ప్రాంతంలోని కొందరు సభ్యులు రాత్రి సమయంలో నిఘా వేసి రోళ్ళు ఒంటరిగా ఉన్న పశుకొటాల్లో ఉన్న పశువులకు మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి ప్రత్యేక వాహనా లు మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు తమకు తెలిసిందన్నారు. మహారాష్ట్రకు తరలిస్తున్న వాహ నాలను గుర్తించి సీసీ కెమెరా ఆధారంగా వారి ని పట్టుకునేందుకు రెండు బృందాలుగా ఏర్ప డి అన్వేషణ చేయడం జరిగిందన్నారు.

తరలించిన పశువులను నాందేడ్ జిల్లాలో పశువుల గ్యారేజ్లో ఉంచి విక్రయించి ఆదాయం పొందే వారన్నారు. నాందేడ్ జిల్లా కేంద్ర బైంసా పట్ట ణం చెందిన షేక్ జహీర్ ఉమెన్ తో పాటు ముఠా సభ్యులైన ఎస్కే ముర్తుజా ఎండి మహమ్మద్ సయ్యద్ అక్సర్ షేక్ ఉమెన్ షేక్ ఖలీద్ అనే సభ్యులు పోలీసుల రాకను గుర్తించి రాజస్థాన్ రాష్ట్రం కు పారిపోవడం జరిగిందన్నారు.

వారి ఫోన్ సిగ్నల్ ఆధారంగా జిల్లా పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి మూటల్లోని 9 మంది సభ్యులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వారి వద్ద నుంచి బుల్లోరా మహేంద్ర డిజైన్ 8 సెల్ ఫోన్లు 39,280 నగదు స్వాధీనం చేసుకొని అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ వెల్ల డించారు.

రాజు అయూబ్ పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. పశువులను దొంగలించి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలు కూడా దొంగతనాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. దొంగల ముఠా ను పట్టుకున్న ఎస్పీలు రాకేష్ మీనా అవినాష్ కుమార్ ముధోల్ సిఐ మల్లేష్ ముధోల్ సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలను పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు.