30-07-2025 04:44:05 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఎంజెపి గురుకుల పాఠశాల కళాశాల(MJP Gurukul School and College)లో విద్యాబోధనకు అతిథి ఉపాధ్యాయుల కోసం కాంట్రాక్ట్ పద్ధతిపై నియామక ప్రక్రియ గురువారం నిర్వహిస్తున్నట్లు ఆర్సిఓ శ్రీధర్ డిసిఓ గీత తెలిపారు. నిర్మల్ ఎంజెపి పాఠశాలలో మ్యాస్ ఫిజిక్స్ ఇంగ్లీష్ కెమిస్ట్రీ ఫిజికల్ సైన్స్ చరిత్ర బోధించే ఉపాధ్యాయ పోస్టులు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉన్నత పాఠశాల కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు గురువారం నేరుగా ఇంటర్వూకు హాజరుకావాలని సూచించారు.