16-12-2024 05:48:32 PM
భద్రాచలం (విజయకాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు సంధర్భంగా సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ, ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ కమిషనర్ శ్రీధర్ చేతులు మీదుగా హైదరాబాదులో ముక్కోటి ఉత్సవాల వాల్ పోస్టర్స్, ఇన్విటేషన్ కార్డులు ప్రారంభించారు. అనంతరం వారిని ఉత్సవాలలో పాల్గొనవలసిందిగా భద్రాచలం దేవస్థానం ఇ.ఓ శ్రీమతి రమాదేవి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం దేవాలయం నుండి వెళ్లిన అర్చకులు అధికారులు పాల్గొన్నారు.