23-08-2025 08:41:47 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక నిత్యం అవస్థలు పడుతున్న విషయం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన కలెక్టర్ జయరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్ తో మాట్లాడి 10 మరుగుదొడ్ల నిర్మాణానికి 300 మంది విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలని ఉద్దేశంతో 10 మరుగుదొడ్ల నిర్మాణానికి ఆరు లక్షల 90,000 మంజూరు చేశారు. విద్యార్థుల ఇబ్బందులను తీర్చిన కలెక్టర్కు బిచ్కుంద పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజును కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.