calender_icon.png 24 August, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దురుద్దేశంతో వ్యక్తిని హత్య

23-08-2025 08:45:37 PM

వనపర్తి టౌన్: తన భార్య విడిచి వెళ్లడానికి కారమని అనుమానంతో డబ్బులు దొంగలించి బైక్ కొనాలనే ఉద్దేశంతో హత్య చేసిన ఘటన  పానగల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శనివారం సిఐ కార్యాలయం లో సిఐ కృష్ణ, పానగల్ ఎస్సై తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ వెంకటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారంగా.... పాన్ గల్ మండల కేంద్రానికి చెందిన వసంతపురం రాములు(38)  మేస్త్రి పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడు. పానగల్ గ్రామానికి చెందిన కుంటి కిష్టయ్య గొర్రెల వ్యాపారం  చేసుకుంటున్న క్రమంలో వ్యక్తిగత కారణంగా వ్యక్తిని పతకం ప్రకారం హత్య చేసిన ఘటన పోలీసులు చేదించడం జరిగిందన్నారు.

నిందితుడు తన పథకం ప్రకారం ఈ నెల 20న రాత్రి క కృష్ణయ్య ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో రాములు అతని తలపై పప్పు గుత్తితో బలంగా కొట్టి అనంతరం గొంతు పట్టుకొని ఊపిరాడనియ్యకుండా చేసి హత్య చేశాడు. అనంతరం అతని జేబులో ఉన్న రూ 40,000   నగదును దోచుకొని నేరంలో వాడిన పప్పు గుత్తి కాడను ఎవరు గుర్తుపట్టకుండా మురికి కాలువలో పారవేశాడు. నిందితుడు హత్య అనంతరం వనపర్తి పట్టణంలో తిరుగుతూ రూ 5000 రూపాయలు ఖర్చు చేసి మిలిగిన 33 వేల రూపాయలను తన ఇంటిలో దాచి పెట్టాడు. శనివారం ఉదయం గ్రామంలో తిరుగుతూ ఉన్న సమయంలో పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య కు సంబందించిన వివరాలను వెల్లడించడం జరిగిందన్నారు .