23-08-2025 08:51:41 PM
మణుగూరు,(విజయక్రాంతి): సింగరేణి ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు శనివారం ఏరియాలో పర్యటించారు. జిఎం దుర్గం రాంచందర్ కలిసి పగిడేరు గ్రామంలోని జియో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 20 కిలో వాట్స్ నుండి సామర్ధ్య పెంపుకు గల అవకాశాలఫై అధికారుల సమాలోచనలు జరిపారు. అనంత రం పీ కే ఓసి 4 సందర్శించి బొ గ్గు ఉత్పత్తికి ఆటంకాలు నివా రించి, యంత్ర సామ ర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించా లని అధి కారులను ఆదేశించారు. ఆయన వెంట ఏరియా అధికారులు కనక య్య,శ్రీనివాస్, శ్రీనివాస చారి, రమేష్ బాబు పాల్గొన్నారు.