calender_icon.png 24 August, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

23-08-2025 08:41:59 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ లో ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మలేరియా డెంగ్యూ వ్యాధుల నిర్ధారించి పరీక్షలకు సంబంధించిన కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు చదువుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ విద్య బికనూర్ వైద్యాధికారి డాక్టర్ ఏమిమా పాల్గొన్నారు.