23-08-2025 08:44:22 PM
గద్వాల: జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి పిఎసిఎస్ ల దగ్గర రైతులకు పడి కాపులు నిత్యం యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రతిరోజు యూరియా కోసం పిఎసిఎస్ కార్యాలయం ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. వరుసలో నిల్చున్న యూరియా దొరుకుతుందన్న నమ్మకం రైతులకు కలగడం లేదు. యూరియా కోసం కాళ్లు నొప్పులు వచ్చేలా నిలబడిన ఫలితం లేదు దీంతో తమ వంతు కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు కింద కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళా రైతుల సైతం యూరియా కోసం వరుసలో నిలబడాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొందని మహిళా రైతులు వాపోతున్నారు. గత పదేళ్లలో ఏనాడు కూడా యూరియా కోసం ఇలా గంటల తరబడి వరుసలో నిలబడలేదని మహిళా రైతు గోవిందమ్మ తెలిపారు.