23-08-2025 08:49:07 PM
ఉప్పల్ (విజయక్రాంతి): మల్లాపూర్ లోని ఎన్ఎఫ్సి చౌరస్తాలో త్వరలో ప్రారంభం కానున్న సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్య అతిథిగా రావాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud)ను మల్లాపూర్ గౌడ్ సంఘ నాయకులు కోరారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న విగ్రహణం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రికి తెలియజేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా హాజరవుతానని తెలిపినట్టు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం నాయకులు దంతూరి రాజు రంగు మల్లికార్జున గౌడ్ రంగు ప్రసాద్ గౌడ్ రంగు శ్రావణ్ గౌడ్ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.