calender_icon.png 24 August, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ పర్యటన

16-12-2024 05:41:50 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జెకె కాలనీలో ఉన్న సింగరేణి హై స్కూల్ ని ఎడ్యుకేషన్  సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ సందర్శించారు. పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యాలయలు పవిత్ర దేవాలయాలని సింగరేణి సిఎండి బలరాం నాయక్ చూపెట్టిన మార్గదర్శకంలో కుటుంబ స్ఫూర్తితో సింగరేణి విద్యాసంస్థలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దాలని దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ఎంపీటీసీఎల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఎంపిటిసి అనేది దేశంలో అతిపెద్ద విద్యా విధానమును విద్యార్థులకు అభ్యసించడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీనికి డాక్టర్ డి నరసింహ స్వామి సమన్వయ కర్తనగా నియమించడం జరిగిందన్నారు. సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్ఎసిసి అగ్రికేట్ కోసం కొన్ని విషయాలపై సిబ్బందితో చర్చించి తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సెక్యూరిటీగా చార్జి తీసుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్క విద్యాసంస్థలు ఆకాశమాధిక తనిఖీలు చేయడం ముఖ్యమైన సూచనలు ప్రధానోపాధ్యాయులకు బోధన, బోధనేతర సిబ్బందికి చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీవల్లి శ్రీనివాసరావు, టెన్త్ క్లాస్ టీచర్ విష్ణు ప్రియ, నరసమ్మ, రవీందర్, సీనియర్ ఉపాధ్యాయులు బొద్దుల శ్రీనివాసరావు ఏ శ్రీనివాసరావు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.