23-08-2025 08:48:33 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇరువురు వ్యక్తులు మధ్య మద్యం మత్తులో నెలకొన్న గొడవ ఒకరిపై హత్యాయత్నానికి దారితీసింది. స్థానికుల వివరాల ప్రకారం...శనివారం క్రాంతి నగర్ కు చెందిన మహమ్మద్ జహీర్, మహారాష్ట్రకు చెందిన ఇసాక్ లు మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవపడ్డారు. ఈ క్రమంలో కోపంతో ఉన్న ఇసాక్ అనే వ్యక్తి బీర్ బాటిల్ తో జహీర్ పై దాడి చేశాడు. బీరు బాటిల్ తో రీప్స్ భాగంలో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడ్డ వ్యక్తిని రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..