calender_icon.png 24 August, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు తప్పని తిప్పలు...?

23-08-2025 08:51:37 PM

మురుగు నీరు పారుతున్న పట్టించుకోని బల్దియా

గుమ్మడిదల: మురుగునీరుతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి అంబేద్కర్ విగ్రహం ముందుగల కాలువ నుండి మురుగు నీరు ప్రధాన రహదారిపై పారుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. పత్రికల్లో కథనాలు ప్రచురితమైనా మున్సిపల్ కమిషనర్ దశరథ్(Municipal Commissioner Dasharath) చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామ ప్రజలు, విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీటి నుండే కాలినడకన పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాలకులు, అధికారులు మొద్దునిద్ర వదిలి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.