calender_icon.png 24 August, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

23-08-2025 08:38:45 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సెప్టెంబర్ 4న వేములవాడలో.. 6న సిరిసిల్లలో వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.శనివారం  సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో  నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి  పండుగల సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పీస్ కమిటి సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.... సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబి పండుగ, ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనం కార్యక్రమాలు సిరిసిల్ల జిల్లాలో  ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సెప్టెంబర్ 4న వేములవాడ, సెప్టెంబర్ 6న సిరిసిల్లలో వినాయక నిమజ్జనం జరగాలని, దానికి తగిన విధంగా రెవెన్యూ,, నీటిపారుదల, పోలీస్ ఫిషరీస్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.గణేష్ మండపాలకు నిమజ్జనం రోజు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఎటువంటి కోతులు లేకుండా కొనసాగాలని, నిమజ్జనం పాయింట్లు వద్ద పవర్ జనరేటర్ లను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని, గణేష్ విగ్రహం నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని,  నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని  కలెక్టర్ అధికారులకు సూచించారు.

సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో మూడు. చొప్పున క్రేన్లు,పది మంది చోప్పున గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని అన్నారు. నిమజ్జనం వద్ద అగ్ని ప్రమాదాలను నివారించేందుకు  సిరిసిల్ల పట్టణంలో 1, వేములవాడ పట్టణంలో 1 అగ్నిమాపక వాహనం, ఇతర ప్రాంతాలకు టూ వీలర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. నిమజ్జనం జరిగే రోజు లిక్కర్ షాప్ మూసి వేయాలని అన్నారు. గణేష్ నిమజ్జనం పాయింట్ల వద్ద పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని, బృందాలను అందుబాటులో పెట్టుకోవాలని, త్రాగునీటి సరఫరా, లైటింగ్, బ్యారికేడ్ల ఏర్పాటు, మొబైల్ టాయిలెట్ వంటి సదుపాయాలను కల్పించాలని  అన్నారు. 

వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణా శాఖ అధికారి సర్టిఫై చేయాలని, ప్రతి గణేష్ మండపం వద్ద అవసరమైన మేర బందోబస్తు ఏర్పాటు చేయాలని, గణేష్ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా కట్టు దిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ సూచించారు. వినాయక మండపాల వద్ద సరైన లైటింగ్ సౌకర్యం కల్పించాలని పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో వినాయక నిమజ్జనానికి అనువైన ప్రాంతాలను పంచాయతీ కార్యదర్శులు ఇతర సిబ్బంది సహకారంతో గుర్తించాలని కలెక్టర్ పంచాయతీ అధికారిని ఆదేశించారు.నిమజ్జనం పాయింట్ల వద్ద అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలని కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా అందరూ సహకరించి పండుగ వాతావరణంలో గణేష్ ఉత్సవాలను, మిద్ ఉల్ నబీ పండుగ నిర్వహించేలా చూడాలని కలెక్టర్ అన్నారు. ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ... మిలాద్ ఉన్ నబి, గణేష్ నిమజ్జనం కలిసి వస్తున్న నేపథ్యంలో మతసామరస్యం దెబ్బతినకుండా పకడ్బందీ భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.