20-05-2025 02:17:26 AM
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఉద్యోగాల భర్తీలో వేగం పెంచిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వరుసగా ఫలితాలను విడుదల చేస్తున్నది. పది రోజుల వ్యవ ధిలోనే 732 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2), 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను విడుదల చేసిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూ ట్‌మెంట్ బోర్డు, సోమవారం ఎంపీహెఏ (ఫిమేల్) పోస్టుల రాత పరీక్ష ఫలితాలను మెడికల్ రిక్రూట్‌మెం ట్ బోర్డు విడుదల చేసింది. 1,931 పోస్టులకు 20,600 మంది అభ్యర్థులు పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రాశారు. బోర్డు వెబ్‌సైట్‌లో మా ర్కుల జాబితా అందుబాటులో ఉందని, హాల్‌టికెట్, ఇతర వివరాలు ఎంటర్ చేసి మార్కులు చెక్ చేసుకోవాలని బోర్డు సూచించింది. త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని ప్రకటించింది.