calender_icon.png 20 November, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

20-11-2025 12:31:13 AM

వనపర్తి టౌన్, నవంబర్ 19: భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టి నిరుపేదల అభ్యున్నతికి వెన్ను దన్నుగా నిలిచి ఉక్కు మహిళగా పేరుగాంచారని వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం వనపర్తి పట్టణం ఇందిరాపార్క్ లో  ఆమెవిగ్రహానికిపూలమాలలువేసినివాళులర్పించారు.

గరీబి హటావో అని నినందించి సీలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చి భూమిలేని నిరుపేదలకు సాగు భూమిని అందించి నిరుపేదల అభ్యున్నతికి పాటుబడ్డారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.బ్యాంకులను జాతీయకరణ చేసి నిరుపేదలకు బ్యాంకు సేవలను అందుబాటులో తెచ్చారన్నారు. హరిత విప్లవం తీసు కొచ్చి పంటలు దిగుబడి పెంచి అన్నదాతల శ్రేయస్సు  కోసం పాటుపడిన వ్యక్తి ఇందిరాగాంధీని ఆయన అన్నారు.ఇందిరా గాంధీ కుటుంబం పూర్తిగా ప్రజాసేవకై ప్రాణాలర్పించారని ఆయన అన్నారు.

ధీరశాలి అయిన ఇందిరా గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరం పాటుపడాలని ఆయన సూచించారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్,  మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రపంచమంతా భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పింది 

మహబూబ్ నగర్, నవంబర్ 19(విజయక్రాంతి): ప్రపంచమంతా భారత దేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పి ఉక్కు మహిళగా దేశానికి ఎనలేని సేవలు చేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని, అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన ఇందిరా గాంధీ విగ్రహావిష్కరణను ఎమ్మెల్యే దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ గరీబి హటావో నినాదంతో పేదలకు కనీస అవసరాలైన రోటి, కపడా, మఖాన్ కల్పించి, రాజ భరణాలు రద్దు చేసి బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందన్నారు. ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివని, ఆమె ఆశయాల సాధన కోసం ప్రతీ పౌరుడు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ , మాజీ టీటీడీ బోర్డు మెంబర్స్ జీవన్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, మల్లు నర్సింహా రెడ్డి, బెక్కరి అనిత, వినోద్ కుమార్, ఎపీ మిథున్ రెడ్డి, సిరాజ్ ఖాద్రి , ఎన్పీ వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.