20-11-2025 12:30:53 AM
మునిపల్లి, నవంబర్ 19 : మండలంలోని అంతారం జీవన్ముక్త పాండురంగా విఠలేశ్వర్ ఆలయంలో ఉన్న గుండంలో స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘ టన బుధవారం చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామానికి చెందిన ధనసిరి తుకారం (43) అనే వ్యక్తి మునిపల్లి మండలం అంతారం గ్రామంలో జాతర సందర్భంగా బంధువుల ఇంటికి మంగళవారం వచ్చాడు.
అయితే ఆలయం వద్ద ఉన్న గుండంలో ఈత కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆయనకు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతి చెందాడు. మృతుని భార్య ధనసిరి చిలకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్త్స్ర రాజేష్ నాయక్ తెలిపారు.