calender_icon.png 26 October, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యం..

25-10-2025 10:25:03 PM

పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

చండూరు (విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన మొదటి లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇడికుడ గ్రామం నుండి ఘట్టుప్పల్ మండలం తెరట్ పల్లి వరకు 30 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు వెడల్పు నిర్మాణ పనులు, తాస్కాని గూడెం గ్రామం నుండి చండూరు టౌన్ వరకు 13 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు వెడల్పు నిర్మాణ పనులు, చండూరు పట్టణంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు.

రోడ్డు వెడల్పులో భాగంగా  ఉన్నత పాఠశాల వద్ద అడ్డుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ను అక్కడ నిర్మించిన డ్రైనేజీ కాలువను పరిశీలించారు. యజమానులతో మాట్లాడి అడ్డుగా ఉన్న షాపుల ని తొలగించాలని అన్నారు. చండూరు పట్టణంలో 2.90 కోట్ల వ్యయంతో శనిగచెరువు ( చిన్న కుంట చెరువు ) సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి స్థానిక నాయకులతో కలిసి కట్టను చెరువును పరిశీలించారు. మండలంలోని గుండ్రపల్లిలో నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ  లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి  ప్రారంభించారు.  కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరైన జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,చండూర్ ఆర్డీవో శ్రీదేవి, చండూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోల వెంకటరెడ్డి కాంగ్రెస్ మండలాధ్యక్షులు కొరిమి ఓంకారం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సుజాత వెంకటేష్, పట్టణ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్, ట్రస్మజిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచులు కల్మికొండ పారిజాత జనార్ధన్, నల్లగంటి మల్లేష్, అబ్బన బోయిన లింగయ్య గండూరి జనార్ధన్, కార్య నిర్వాహక ఇంజనీర్ ఆర్ అండ్ బి. కే శ్రీధర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ ఏల్. మల్లేశం, పి నాగ ప్రసాద్,అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ అండ్ హెల్త్  అధికారులు ఉన్నారు.