calender_icon.png 26 December, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

26-12-2025 12:00:00 AM

మంత్రి గడ్డం వివేకానంద

చెన్నూర్, డిసెంబర్ 25 :  రాష్ట్ర ప్రభు త్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మాట్లాడారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మధ్యాహ్న భోజనంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు.

చెన్నూరు మండల కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందని, సామాజిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వచ్చే వేసవికాలంలో చెన్నూరు నియోజక వర్గంలో నీటి సమస్య లేకుండా నిరంతరం తాగునీటిని అందించేందుకు ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటి వరకు ఆరు వేల ఇండ్లు బేస్మెంట్, 2,300 ఇండ్లు రూఫ్ లెవెల్ వరకు పూర్తయ్యాయని, స్లాబ్ లెవెల్ వరకు పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతా లో రూ. 4 లక్షలు జమ చేశామన్నారు. 11 ఇండ్లు పూర్తి చేయబడి లబ్ధిదారులకు రూ. 5 లక్షలు మంజూరు చేశామని, ఇండ్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నా రు. ప్రజా అవసరాలు తీర్చేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. 

చెక్కుల పంపిణీ...

ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి వివేక్ వెంకట స్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ మున్సిపల్ అభివృద్ధి కొరకు రూ. 18 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, టి ఎమ్ ఐ డి సి నుంచి అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేసే అవకాశం ఉందని, చెన్నూ రు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

జైపూర్, భీమారం మండలాలలో అంబేద్కర్ భవన్, రూ. 25 లక్షలు జగ్జీవన్ రామ్ భవన్, రూ. 25 లక్షలతో షెడ్యూల్ తెగల కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరిం చుకొని చెన్నూర్ మండల కేంద్రంలోని ఈఎంఐ చర్చ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. 

ప్రజల సౌకర్యార్థం రోడ్ల ఏర్పాటుకు చర్యలు 

ప్రజల సౌకర్యార్థం చెన్నూరు నియోజకవర్గంలో అంతర్గత రహదారుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మం త్రి గడ్డం వివేకానంద అన్నారు. జిల్లాలోని మందమర్రి పట్టణం దీపక్ నగర్ వార్డులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో కలిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో ప్రజల సౌకర్యార్థం రహదారులు, అంతర్గత రహదారులు మురుగు కాలువల నిర్మాణం చేపట్టి దాదాపు 70 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

ప్రతి గ్రా మంలో సోలార్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, అమృత్ పథకం లో భాగంగా చెన్నూ ర్, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలలో 100 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందని, ప్రతి ఇంటికి నిరంతరాయంగా త్రాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.