24-10-2025 12:00:00 AM
పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు
కల్తీ కల్లుకు ప్రాణాలు హరి
ఎల్లారెడ్డి, అక్టోబర్ 23(విజయ క్రాంతి): కల్తీ కల్లు కాటేస్తుంది. కల్తీ కల్లు కు ప్రాణాలు హరి మంటున్నాయి. కామారెడ్డి జిల్లాలో పలు సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామంలో కల్తీ కల్లు కు బానిస గా మారి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కల్తీ కల్లు తాగుదామని వెళ్తే కాటికి పంపేశారు..
కల్తీ కల్లు లో ఏమేం కలుపుతున్నారో తెలుసా..! కల్తీ కల్లు ప్రాణాలు తీస్తుందని తెలిసినా.. చాలా మంది దానికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తక్కువ ధరకే దొరుకుతుండ టంతో కల్లు కాంపౌండ్లలోకి వెళ్లి ఆ కల్తీ కల్లు, రసాయనాలు కలిపిన కల్లు తాగి.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. కల్తీ కల్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.
సహజంగా చెట్ల నుంచి వచ్చే కల్లులో రసాయనాలు, నీళ్లు, ఇతర పదార్థాలు కలిపి భారీ మొత్తం లో తయారు చేసి కల్లు కాంపౌండ్లలో విక్రయిస్తున్నారు. ఇలాంటి కల్లు తాగడం వల్ల అవయవాలు పనిచేయకుండా పోయి ప్రాణాంతకంగా మారుతోంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కల్లు తాగడం చాలా మందికి ఒక అలవాటుగా ఉంటుంది. కేవలం మత్తు కోసమే కాకుండా.. కల్లులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని చెబుతూ ఉంటారు.
అందుకే ఊర్లలో కల్లు తాగడం అనేది పెద్ద సమస్యగా, వింతగా చూడరు. కానీ పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి స్వచ్ఛమైన కల్లు దొరకడం చాలా కష్టం. కల్లులో రసాయనాలు, ఇంకా వేరే వేరే పదార్థాలు కలిపి.. కల్తీ చేసి.. కల్లు కాంపౌండ్లలో విక్రయిస్తున్నారు. ఇదే ఇప్పుడు పట్టణ ప్రజల ప్రాణాలపైకి తీసుకువస్తోంది.
కల్తీ కల్లు తాగి.. అస్వస్థతకు గురి కావడం, దానికి అలవాటై అనారోగ్యం పాలు కావడం, చివరికి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కల్తీ కల్లు తాగి చనిపోయిన సంఘటనలు వెలుగుచూసిన ప్రతీసారి.. అధికారులు హడావుడి చేసినా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.
కల్తీ కల్లు వల్ల ఎందుకు చనిపోతారు?
కల్తీ కల్లులో కలిపే రసాయనాలు మనుషుల మరణానికి దారితీస్తాయి. లేదా దీర్ఘకాలికంగా శరీరంలోని అవయవాలను పూర్తిగా దెబ్బతీసి మృతికి కారణం అవుతున్నాయి.
కల్తీ కల్లు వల్ల దుష్ప్రభావాలు:
కల్తీ కల్లు తాగడం వల్ల మనుషులకు చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. కొందరికి వెంటనే మరికొందరికి దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కల్తీ కళ్ళు సేవించి 19 ఏళ్ల యువకుడు మృతి తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ నాగిరెడ్డిపేట మండలంలో, జరుగుతున్న కల్తీ కళ్ళు విషయం వెలుగుచూసిన కల్తీ కల్లు ఘటన మరోసారి.. చర్చకు దారితీసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామానికి చెందిన ధ్యాకమొల్ల,కుమార్ అనే 19 సంవత్సరాలు యువకుడు కూలి పని చేసుకుంటూ కల్తీ కల్లు సేవించడం వల్లే మృతుడి చావుకి కారణమని పరిసర ప్రాంతంలోని ప్రజలు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మద్యానికి బానిసై,కల్తీ కల్లు తాగి కుటుంబ సభ్యులను తరుచూ బాధపెట్టేవాడు.మృతిడికి,పెళ్లి కాలేదు.మృతుడికి అన్న నాగరాజు ,హైదారాబాద్ లో కూలి పనులు చేసుకుని జీవిస్తాడు.మృతుడి మరణం తో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు తెలిపారు. కనీసం అధికారులు ఇకనైనా యువకులను మత్తుకు అలవాటు పడకుండా కల్తీ కల్లుకాటుకు మృత్యువాత పడకుండా కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు.
కల్తీ కల్లు విక్రయిస్తున్న దుకాణ యజమానులపై ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలను కాపాడవలసిన అధికారం ఆప్కారి శాఖకు ఉన్నదని, గ్రామాలలో చెట్లనుండి గీసిన కళ్ళు కరువై చెత్త కంపెనీల నుండి కెమికల్ ద్వారా రసాయనాలు తీసుకొచ్చి మత్తుకు యువతను బానిసను చేస్తూ కాసులు జమ చేసుకుంటూ ప్రజల ప్రాణాల ఉసురు పోసుకుంటున్న,కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఎక్సైజ్ అధికారులను కోరుతున్నారు.
కల్తీకల్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం
కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు అమ్మకాలు నిర్వహిస్తే స్థానిక ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. సంబంధిత కల్తీ కల్లు విక్రయదారులపై కేసులు నమోదు చేస్తాం.
హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, కామారెడ్డి