23-10-2025 11:05:11 PM
ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాణిక్ యాదవ్..
అమీన్ పూర్: అమీన్ పూర్ గ్రామంలో జాతర వాతావరణంలో ఉత్సాహంగా నిర్వహించిన సదర్ పండగ ఉత్సవాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలో జాతర వాతావరణం నెలకొని ఉండగా, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పండుగను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐలాపూర్ మాణిక్ యాదవ్ మాట్లాడుతూ.. దీపావళి ముగిసిన రెండో రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటామన్నారు. సదర్ పండగ మన గోపాలకుల ఆచార వ్యవహారాల ప్రతీక, మన పశుసంవర్ధక సాంప్రదాయాన్ని, గ్రామీణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప పండగ, మనం మన సంప్రదాయాలను కాపాడుకోవడం, వాటిని భవిష్యత్ తరాలకు అందించడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గ్రామ పెద్దలు, రైతు నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.