26-05-2025 01:50:40 AM
-మంజీరా సరిహద్దు వరకు పాకిన దందా
- మామూళ్ల మత్తులో పోలీసులు
కామారెడ్డి, మే 25 (విజయ క్రాంతి), పేకాట జిల్లాలో జోరుగా సాగుతుంది. ప్రతి పల్లె మొదలు కుని మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలు, మారుమూల గ్రామాల సరిహద్దులు, బాన్సువాడ, జుక్కల్, నియోజకవర్గంలోని మంజీరా నది సరిహద్దు ప్రాంతంలో యదేచ్చగా పేకాట దందా కొనసాగుతుంది.
పోలీస్ అధికారులకు తెలిసిన నెలసరి మామూల్లు నిర్వాహకులు ముట్ట చెప్పుతుండడంతో లక్షల రూపాయల పేకాట దండ నిత్యం జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం తో పేకాట రాయుల్లు పేకాట దందాలు ఏదేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
కామారెడ్డి డివిజన్లో ఓ మోతు భారీ రైతు కుమారుడు పేకాటనే నిత్యం పాడుతూ 20 ఎకరాల కూ పైగా ఉన్న భూమిని నేడు నాలుగెకరాల వరకు తెచ్చాడంటే ఎక్కడో పెట్టుబడి పెట్టలేదు. కేవలం పేకాట వ్యసనంలో పాల్గొని పోగొట్టుకున్న డబ్బులతో ఆస్తులు అమ్ము కున్నాడు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామాల్లో సైతం పేకాట దం దా జోరుగా సాగుతుంది.
కొద్ది రోజులు జిల్లా కేంద్ర ంలోని లాడ్జిలను అడ్డగా మార్చి పేకాట జోరును కొనసాగి స్తున్నారు. లాడ్జిల నిర్వాహకులు పోలీసులకు నెలవారి మాముళ్ళు ఇచ్చి లాడ్జి నిర్వాహకులు పేకాట దందాలు కోనసాగిస్తున్నారు. మరి కొన్ని రోజులు వ్యవసాయ భూముల వద్ద, పామ్ హౌజూలను అడ్డాలుగా మార్చుకోండి పేకాట కొనసాగిస్తున్నారు. పేకాట ఆడుతున్న చోటుకే చికెన్, మటన్, ఎగ్, కర్రీలతోపాటు బిరియానీతో పాటు మద్యం సరఫరా చేస్తున్నారు.
ప్రతి ఆటకు కొంత మొత్తాన్ని తీసి చివరకు డబ్బులు పోగొట్టుకున్న వారు డబ్బులు వచ్చిన వారు కలిసి విందు చేసుకుంటున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకొని ఆస్తులను ఆ ఆమ్ముకుంటున్నారు. డబ్బులు పేకాట స్థావరంలో పెట్టకుండా ఫోన్ పే, గూగుల్ పే లను పేకాటరాయిలు, నిర్వాహకులు యూస్ చేస్తున్నారు. దీంతో విచ్చల విడిగా పేకాట దందా గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల కు యువత బానిసై డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
కుటుంబాలలోచిచ్చు రేపుతున్న పేకాట
కామారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ని గ్రామంలో ఓ రైతు పేకాటలో సర్వం పోగొట్టుకున్నా డు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమై మనస్పర్ధలు పెరిగాయి. పేకాటకు బానిసైనా యువ రైతు చివరకు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకు న్నారు. ఇలాంటి సంఘటనలు గ్రామా లలో జోరుగా పెరుగుతున్నాయి.
పోలీసులు మాత్రం కడుపులో నొప్పి భరించలేక ఆత్మహత్య అంటూ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆత్మహత్యల వెనుక అసలు కారణాలను పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో మెప్పించి తప్పుడు పిటీషన్ ఇప్పించి కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య అంటూ కేసులు ముగిస్తున్నా రనే ఆరోపణలు వస్తున్నాయి.
మంజీర పరి వాహాక ప్రాంతంలో జోరుగా పేకాట
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాలలోని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామా లు, మంజీరా నది పరి వాహక ప్రాంతాల లో పేకాట దందా ఏళ్ల తరబడి కొనసాగుతుందంటే పోలీసులకు తెలియకుండానే పేకాట దం దా కొనసాగుతుందా అనే విమర్శలు వస్తున్నా యి.
ఏళ్ల తరబడి నిర్వాహకులు పేకాట స్తావరాలను ఏర్పాటుచేసి పేకాట ఆడిస్తు న్నారు. పేకాట ప్రాంతానికి సకల సౌకర్యాలు సమకూర్చి ఆటకు కొద్ది మొత్తంలో డబ్బు లు తీసుకుంటూ పేకాట స్తావారానికి వచ్చి న వారి సెల్ ఫోన్ లో తీసుకొని వారు వెళ్లే సమయంలో ఇస్తున్నారు.
పేకాట ఆడుతున్న స్థానాన్ని ఆట ఆడే వారికి మాత్రమే పేకాట నిర్వాహకులు సమాచారాన్ని అందించి కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు లక్షల రూపాయలు పేకాటలో చేతులు మారు తున్నాయి. ఎంతోమంది ఆర్థికంగా నష్ట పోతున్నారు. ఎంతోమంది రైతులు భూము లను అమ్మి పేకాటలో డబ్బులు పోగొట్టు కుంటున్నారు.
కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పేకాట కొనసాగుతున్న ఉన్నతాధికారులకు మాత్రం స్థానిక పోలీస్ అధికారులు తప్పుడు సమా చారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నామ మాత్రం గా అప్పుడప్పుడు పేకాట స్థావరాల పై దాడులు నిర్వహించి తక్కువ మొత్తంలో డబ్బులు దొరికినట్లు చూపెడుతు న్నారు.
కానీ ప్రతిరోజు గ్రామాలలోని లక్షల పేకాట దందా కొనసాగి స్తున్నారు. పట్టణ కేంద్రాల్లో సైతం పేకాట అడ్డా లుగా మార్చుకొని పేకాట ఆడుతున్నారు.
మామూళ్ల మత్తులో పోలీసులు
ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పోలీస్ నిఘా వర్గాలు పేకాట, మట్కా, గంజాయి వంటి దందాలు జరిగితే వెంట వెంటనే పోలీసులతో అధికారులకు నివేదించాల్సిన నిఘా విభాగం మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పేకాటను జిల్లాలో నిర్మూలిస్తాం
కామారెడ్డి జిల్లాలో పేకాట ను నిర్మూలిస్తాం. పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందిస్తే నేరుగా వెళ్లి దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తాం. స్థానిక అధికారులను సైతం అలర్ట్ చేసి జిల్లాలో పేకాటను నిర్మూలిస్తాం. గంజాయి, అల్ఫాజూలం లాంటి మత్తు పదార్థాల నిర్మూలన కు కృషి చేస్తున్నాం.
రాజేష్ చంద్ర, ఎస్పి, కామారెడ్డి