26-05-2025 01:50:57 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, మే 25 (విజయ క్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనులలో భాగంగా ఈ రోజు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి 31 వ డివిజన్ హంటర్ రోడ్డు లో గల నంది హిల్స్ లో రూ.40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం, 59 వ డివిజన్ ఇందిరా నగర్, స్నేహ నగర్ లో రూ.62 లక్షలతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.
అదే డివిజన్ లో ఎక్సైజ్ కాలనీలో సుమారు 80 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు దాదాపు 1.82 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శిలాఫలకం ఏర్పాటు చేసిన కొబ్బరికాయ కొట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం నిర్ణీత సమయంలోనే పూర్తిచేస్తామని ప్రజలకు ప్రజా ప్రభుత్వం నిజమైన భరోసా ఇస్తుందని అన్నారు.
గడిచిన 15 నెలలుగా నగరంలో ఎటువంటి ఖబ్జాలు లేవని, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు, వ్యాపార వర్గాలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. నిత్యం పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం, నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముందుకు వెళ్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షుడు రవి కిరణ్, కాంగ్రెస్ నాయకులు ఇ.వి శ్రీనివాస్ రావు కేతిరెడ్డి దీపక్ రెడ్డి, మండల సమ్మయ్య, దొంగర శ్రీనివాస, తేల్ల సుగుణ కిషోర్, పార్టీ నాయకులు, కాలనీ వాసులు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.